భారతదేశం, డిసెంబర్ 14 -- అమెరికా రోడ్ ఐలాండ్​లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

యూనివర్సిటీ ప్రొవోస్ట్ (సీనియర్​ అధికారి) ఫ్రాంక్ డోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం) ఇంజనీరింగ్ భవనంలో ఫైనల్ పరీక్షలు జరుగుతుండగా, గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన వెంటనే యూనివర్సిటీ క్యాంపస్ యాక్టివ్ షూటర్ అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.

"తలుపులు లాక్ చేయండి, ఫోన్‌లు సైలెంట్‌గా ఉంచండి. తదుపరి నోటీసు వచ్చే వరకు దాక్కోండి. గుర్తుంచుకోండి: మీరు ప్రమాదంలో ఉన్న ప్రాంతంలో ఉంటే, సురక్షితంగా బయటపడగలిగితే పారిపోండి; ఖాళీ చేయడం సాధ్యం కాకపోతే, దాక్కోండి; చివరి ప్...