భారతదేశం, జూలై 21 -- క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం కొన్నిసార్లు కష్టమైన ప్రక్రియ అవ్వొచ్చు. ముఖ్యంగా దరఖాస్తు తిరస్కరణకు గురైతే అది నిరాశ కలిగించవచ్చు. అయితే, ఇలా జరిగినప్పుడు మీ ఆర్థిక అలవాట్లు, క్రెడిట్ అర్హతను సమీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించాలి. క్రెడిట్ కార్డ్ దరఖాస్తులు తిరస్కరణకు గురవడానికి గల ప్రధాన కారణాలను, అలాగే ఆమోదం పొందే అవకాశాలను ఎలా పెంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

1. తక్కువ క్రెడిట్ స్కోర్

మీ దరఖాస్తు తిరస్కరణకు గురవడానికి అత్యంత సాధారణ కారణం తక్కువ క్రెడిట్ స్కోర్ ఉండటమే! సాధారణంగా, రుణదాతలు 700-750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌లను చూస్తారు. మీ స్కోర్ 'ఫెయిర్' లేదా 'సగటు' పరిధిలో ఉన్నప్పటికీ, మీకు క్రెడిట్ కార్డ్ లభిస్తుందని దీని అర్థం కాదు. మీ క్రెడిట్ రిపోర్ట్‌లో లోపాలు, తప్పుడు డిఫాల్ట్‌లు, పునర...