భారతదేశం, నవంబర్ 19 -- బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు రాఘవ్ చద్దా తమ కొడుకు పేరును రివీల్ చేశారు. అతనికి 'నీర్' (Neer) అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. తమ బాబు కాళ్లకు ముద్దు పెడుతున్న ఫొటోలను ఈ సెలబ్రిటీ కపుల్ షేర్ చేసుకుంది. ఆ ఫొటోలు వైరల్ కావడంతోపాటు అసలు ఆ పేరుకు అర్థమేంటో తెలుసుకోవడానికి అభిమానులు సెర్చ్ చేస్తున్నారు.

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా బుధవారం (నవంబర్ 19) తన కొడుకు పేరేంటో చెప్పారు. ఈ పేరును ఓ సంస్కృత శ్లోకం నుంచి పెట్టడం విశేషం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆ శ్లోకంలోని ఒక వాక్యాన్ని షేర్ చేశారు. జలస్య రూపం, ప్రేమస్య స్వరూపం.. తత్ర ఇవ నీర్ అన్నది ఆ శ్లోకం. అంటే నీటి రూపం, ప్రేమ స్వరూపమే ఈ నీర్ అని అర్థం.

సంస్కృత మూలం నుండి వచ్చిన 'నీర్'కు నీరు అని ప్రాథమిక అర్థం. నీరు.. ...