భారతదేశం, డిసెంబర్ 4 -- నందమూరి నటసిహం బాలకృష్ణ-బ్లాక్ బస్టర్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వంటి పవరు‌ఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో సినిమా అఖండ 2 తాండవం. సింహా, లెజెండ్, అఖండ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అఖండ 2 సినిమాను వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న 2డీ, త్రీడీ ఫార్మాట్‌లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో అఖండ 2 ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. బాలయ్యతో అఖండ సినిమా చేసాం. అది రీజినల్ సినిమా కాదు ఇండియన్ సినిమా. అలాగే అఖండ 2 చేశాం. ఇది భారత దేశ ఆత్మ. మీరందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.

"అఖండ 2 సిని...