Hyderabad, ఆగస్టు 21 -- మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. హీరోయిన్‌గా సంగీత ఎంతోమంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మలయాళంలో దర్శన రాజేంద్రన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కలిసి నటించిన తెలుగు సినిమా పరదా.

సినిమా బండి, శుభం సినిమాల డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన పరదా మూవీలో రాగ్ మయూర్, గౌతమ్ మీనన్, రాజేంద్ర ప్రసాద్, హర్ష వర్ధన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 22న థియేటర్లలో పరదా మూవీ రిలీజ్ కానుంది. కానీ, సినిమాపై నమ్మకంపై రెండు రోజుల ముందే మీడియాకు పరదా ప్రీమియర్ షోలు వేశారు మేకర్స్.

"రివ్యూలు చదివాకే మా సినిమాకు రండి" అని అనుపమ పరమేశ్వరన్ ఓపెన్ కామెంట్స్ కూడా చేసింది. అనుపమ పరమేశ్వరన్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్న ఈ సినిమా ఎలా ఉందో నేటి పరదా రివ్యూలో తెలుసుకుందాం...