భారతదేశం, జనవరి 13 -- కొంతమంది పెంపుడు జంతువులు లేకుండా ఉండలేరు. పెట్ అంటే కొందరికి ప్రాణం. అలా అని సంక్రాంతికి వెళ్తూ.. ఇంటికి తీసుకెళ్దామంటే.. వాటికే ఇబ్బంది. దీంతో హైదరాబాద్‌లో పెంపుడు జంతువుల హాస్టళ్లు, బోర్డింగ్ సౌకర్యాలకు డిమాండ్ బాగా పెరిగింది.

తమ స్వస్థలాలకు ప్రయాణించే చాలా మందికి తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లడం కష్టంగా ఉంది. ఇంట్లో ఉంచి సంరక్షకులకు అప్పజెప్పాలనుకుంటే.. పెంపుడు జంతువులకు సరిగ్గా ఆహారం ఇస్తారా లేదా అనే ఆందోళనలు, కొత్త వ్యక్తులకు అలవాటు పడటానికి పెంపుడు జంతువులు ఇష్టపడకపోవడంలాంటి సమస్యలు ఉంటాయి. దీంతో ప్రొఫెషనల్ బోర్డింగ్ సేవలకు డిమాండ్‌ను పెంచాయి.

హైదరాబాద్ నగరం అంతటా పెంపుడు జంతువుల హాస్టళ్లు.. టీకా రికార్డులు, మొత్తం ఆరోగ్యాన్ని ధృవీకరించిన తర్వాత మాత్రమే జంతువులను చూసుకోవడానికి అనుమతి ఇస్తాయి. అవసరమైన అన్ని ట...