Hyderabad, జూలై 10 -- ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, జీవితంలో ఏ సమస్య రాకుండా ఉండాలని అనుకుంటారు. అయితే రాశుల ఆధారంగా ఏ రాశి వారికి ఏ మంత్రాలు చదవడం వలన కలిసి వస్తుందో, సంతోషంగా ఉండవచ్చో తెలుసుకుందాం.

మొత్తం అన్ని రాశులకు ఆ రాశి అధిపతులు ఉంటారు. వాటి ఆధారంగా ఎవరికి ఏం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశిని కుజుడు పాలిస్తాడు. ఈ రాశి వారు ఆంజనేయస్వామిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. రామ రక్షా స్తోత్రాన్ని చదివితే ఆర్థిక సమస్యలు ఉండవు. "ఓం హం హనుమతే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి.

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదే. "ఓం మహాలక్ష్మి నమో నమః" అనే మంత్రాన్ని చదవడం వలన సమస్యలు తీరే, సంతోషంగా ఉండవచ్చు.

మిధున రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు వినాయకుడికి సంబంధి...