భారతదేశం, మే 15 -- బెజవాడలో బంగారం కొనే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించి కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయి. జిఎస్టీ లేకుండా తరుగు తక్కువకు బంగారం తక్కువ ధరకు లభిస్తుందని కక్కుర్తి పడితే నిలువునా ముంచేస్తారు. విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఈ మోసాలపై ప్రభుత్వ యంత్రాంగాలు కూడా దృష్టి పెట్టడం లేదు.

బంగారం అమ్మకాల్లో వ్యాపారులు రకరకాల లెక్కలు చెప్పి ఆభరణాలకు ధరలు నిర్ణయిస్తుంటాయి. వీటి హేతుబద్దత గురించి సరైన నిర్వచనాలు మాత్రం ఉండవు.

బడా షోరూమ్‌లలో ఆభరణాలను కొనుగోలు చేస్తే తరుగు, మజూరీ, జిఎస్టీ పేరుతో కొంత అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో విజయవాడ హోల్‌ సేల్‌ మార్కెట్‌లలో కొత్త దందా నడుస్తోంది.

బంగారు ఆభరణాల విక్రయాల్లో విజయవాడ గవర్నర్‌పేట మార్కెట్‌కు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. జైహింద్ మార్కెట్‌లో ఉండే బంగారు దుకాణాల్లో గుట్టలుగుట్టలు...