Hyderabad, మే 5 -- ప్రస్తుత ప్రపంచంలో మన దృష్టిని మళ్లించే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఫోన్లు, మెసేజీలు, ఇంట్లో పనులు, పండుగలు, పబ్బాలు, షాపింగ్ లు అనారోగ్యం ఇలా పనులు ఒకేసారి చేయాలనే ఒత్తిడి మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించి మెదడును ఒకే విషయంపై కేంద్రీకరించి పని చేసే శక్తిని పొందడం నిజంగా ఒక అద్భుతమైన విషయం. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఇన్ని చికాకుల మధ్య పని చేయడానికి ఇబ్బంది పడుతూ, పై అధికారులతో తిట్లు తింటూ, కష్టానికి ఫలితం రాలేదని బాధపడే ఉద్యోగులు ఎందరో ఉన్నారు. మీరూ అందులో ఒకరైతే ఇది మీకోసమే.

మీ మెదడును మరింత పదునుగా మార్చి, మీరు చేస్తున్న పనిపై సంపూర్ణంగా దృష్టి సారించేలా శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ఎనిమిది శక్తివంతమైన మార్గాలు ఉన్నాయి. మీ మెదడును మీరు ఒక విషయంపై శ్రద్ధ పెట్టేలా, గొప్పగా పని చేసేలా మార్చేందుకు ఇవి మీ...