Hyderabad, అక్టోబర్ 1 -- టాలీవుడ్ నటి డింపుల్ హయాతీ, ఆమె భర్త విక్టర్ డేవిడ్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఇంట్లో పనిచేసే పనిమనిషి.. ఈ జంట తనపై దాడి చేయడంతోపాటు వేధించారని, హింసించారని ఆరోపించడం గమనార్హం. ఒడిశాకు చెందిన ప్రియాంక బిబర్ (22) అనే పనిమనిషి ఫిర్యాదు మేరకు ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. షేక్‌పేటలోని ఆ జంట ఇంట్లో ఉన్నప్పుడు డింపుల్, విక్టర్ తనను మాటలతో దూషించారని, అవమానించారని, సరైన ఆహారం కూడా ఇవ్వకుండా ఆకలితో ఉంచారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన డింపుల్ హయాతీ ప్రధానంగా తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఈ నటి న్యూమరాలజీ కారణాల వల్ల తన అసలు పేరు "డింపుల్"కి తోడు "హయాతీ"ని తన ఇంటిపేరుగా చేర్చుకుంది. డింపుల్ 2017లో సుమారు 19 ఏళ్ల వయస్సులో 'గల్ఫ్' అనే తెలుగు సిని...