భారతదేశం, నవంబర్ 24 -- పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 25వ తేదీ పంచమీ తీర్థానికి టీటీడీ ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, ప‌ద్మపుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమ‌ణ గేట్లు, సూచిక బోర్డులు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు పూర్తయ్యాయి. తిరుచానూరుకు వచ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ భ‌ద్రత, నిఘా విభాగం ప‌టిష్టమైన భ‌ద్రతా ఏర్పాట్లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా టిటిడి భ‌ద్రతా సిబ్బంది 600 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్‌.సి.సి.విద్యార్థులు 200, శ్రీ‌వారి సేవ‌కులు 900, పోలీస్ సిబ్బంది 1600 మందితో భ‌ద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

భ‌క్తుల సౌక‌ర్యార్థం దాదాపు 150 అన్నప్రసాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళప్ప గార్డన్స్‌లో 50, ఎస్వీ హైస్కూల్ వ‌ద్ద -15, శ్రీ అయ‌ప్పస్వామివారి (నవజీవన్ ఆసుపత్...