భారతదేశం, జూన్ 1 -- కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత అరుదైన కార్యక్రమం జరగనుంది. ఈ పురాతన ఆలయంలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయిన తరువాత వచ్చే వారం మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడం, ఆలయ పవిత్రతను పునరుద్ధరించడమే దీని ఉద్దేశమని ఆలయ అధికారులు తెలిపారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఇలాంటి సమగ్ర పునరుద్ధరణ, దానికి సంబంధించిన ఆచారాలు జరుగుతున్నాయని ఆలయ అధికారి బి.శ్రీకుమార్ తెలిపారు. మళ్లీ జరిగేందుకు చాలా ఏళ్లు పడుతుందన్నారు. ఈ నెల 8న ఆలయ ప్రాంగణంలో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా నిర్మించిన తాళికకుడంల ప్రతిష్ఠ, విశ్వక్సేన విగ్రహ పునఃప్రతిష్ఠ, తిరువంబాడి శ్రీకృష్ణ ఆలయంలో అష్టబంధ కలశం సహా వివిధ కార్యక్రమాలు జరు...