భారతదేశం, నవంబర్ 14 -- పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజులపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఆలస్య రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. ఈ గడువు నవంబర్ 13తో ఈ గడువు ముగిసింది. అయితే ఈ సమయాన్ని నవంబర్ 20 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

రూ. 50 ఆలస్య రుసుముతో నవంబర్ 21వ తేదీ నుంచి 29 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. ఇక రూ. 200 ఫైన్ తో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 15 నుంచి 29 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది.

అన్ని సబ్జెక్టులకు రుసుము రూ.125గా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110. రెగ్యులర్ పరీక్ష రుసుముతో పాటు వృత్తి విద్యా అభ్యర్థులు రూ.60 చెల్లించాలి. ఇప్పటికే గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి.. పరీక్ష...