భారతదేశం, ఏప్రిల్ 25 -- పదో తరగతి పరీక్షల్లో 593 మార్కులు సాధించిన అమూల్య అనే విద్యార్థిని ప్రతిభను.. కలెక్టర్ గుర్తించారు. అమూల్య కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తూ.. పల్నాడు జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశాలిచ్చారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అమూల్య.. పదో తరగతి ఫలితాల్లో 593 మార్కులు సాధించి ప్రతిభ చాటింది.

అయితే.. అమూల్య కుటుంబం కూలికి వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకున్న కలెక్టర్‌ చలించిపోయారు. భూమి లేని నిరుపేదల పథకం కింద విద్యార్థిని కుటుంబానికి ఎకరం పొలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అమూల్యతో పాటు మరో ముగ్గురు ఆడపిల్లలను తల్లిదండ్రులు అనిల్, రూతమ్మ కష్టపడి చదివిస్తున్నారు. సొంతభూమి అయితే.. మరింత కష్టపడి పిల్లలను ఉన్నత విద్యావంతులను చేసుకుంటామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంవత్సరం మొత్తం 6...