Hyderabad, సెప్టెంబర్ 5 -- మిరాయ్ (Mirai) మూవీతో తేజ సజ్జా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో అతనికి ఒకే ప్రశ్న పదేపదే ఎదురవుతోంది. తమిళ ప్రమోషన్లలోలాగే దీనిపై తాజాగా జరిగిన మరో ప్రెస్ మీట్ లోనూ ఓ రిపోర్టర్ పదే పదే రిలీజియస్ మూవీస్ ఎందుకు అని అడగ్గా.. దానికి తేజ ఇచ్చిన సమాధానం అందరినీ మెప్పిస్తోంది.

మిరాయ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా తేజ సజ్జాతోపాటు మూవీ టీమ్ దేశమంతా తిరుగుతోంది. ఈ మధ్యే తమిళ ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లారు. ఇప్పుడు హిందీ ప్రమోషన్లు చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన తేజకు ఓ రిపోర్టర్ ప్రతి సినిమాలో ధర్మం గురించి ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. గతంలో హనమాన్ మూవీలోనూ అతడు నటించిన విషయం తెలిసిందే.

దీనికి తేజ కూల్ గా సమాధానం ఇచ్చాడు. "...