భారతదేశం, నవంబర్ 19 -- పదేళ క్రితం విడుదలైన గ్రూప్ 2 సెలక్షన్ జాబితాపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రూప్‌-2 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది.హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా నియామకాల ప్రక్రియను చేపట్టారంటూ కమిషన్‌ తీరును తప్పుబట్టింది.డబుల్‌ బబ్లింగ్, వైట్‌నర్, ఎరైజర్‌ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్‌ నగేశ్‌ భీమపాక తీర్పును వెలువరించారు.

2019లో వెల్లడించిన గ్రూప్ 2 ఫలితాలు చట్ట విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. సాంకేతిక కమిటీ సిఫారసులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియనంతూ కూడా 8 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

జవాబు పత్రాల దిద్దుబాటు, వైట్నర్‌ వినియోగం, డబుల్‌ బబ్లింగ్‌ వంటి అంశాలను...