భారతదేశం, అక్టోబర్ 30 -- బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ కలిపి బాహుబలి ది ఎపిక్ రూపంలో రిలీజ్ అవుతున్న విషయం తెలుసు కదా. శుక్రవారం (అక్టోబర్ 31) ఈ మూవీ రిలీజ్ కానుండగా.. గురువారం రాత్రి నుంచే థియేటర్లలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి ప్రసాద్ సినిమాస్ లోని పీసీఎక్స్ స్క్రీన్ కి వెళ్లి అభిమానులతో ముచ్చటించాడు.

రాజమౌళి సడెన్ గా థియేటర్లోకి వచ్చేసరికి అభిమానులు ఆశ్చర్యానికి గురై పెద్దగా అరిచారు. మొదట వాళ్లతో బాహుబలి మాహిష్మతి భాషలో జక్కన్న మాట్లాడాడు. మాహిష్మతి రాజ్య ప్రజలు ఎలా ఉన్నారు.. ఆ ముసలోడు బిజ్జలదేవుడు ఉన్నాడా ఇంకా అని సరదాగా అడిగాడు.

ఆ తర్వాత ఈ సినిమాపై పదేళ్లయినా మీ ప్రేమ తగ్గలేదని, అందుకే రీరిలీజ్ చేద్దామా లేక ఏదైనా కొత్తగా చేద్దామా అని ఆలోచించి.. ఇలా ఎపిక్ రూపంలో తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నాడు. మీరు ...