భారతదేశం, జనవరి 5 -- 'ప్రేమమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మలయాళ స్టార్ నివిన్ పాలీ (Nivin Pauly) స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అతడు.. తాజాగా నటించిన 'సర్వం మాయ' (Sarvam Maya) సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటేసింది.

నివిన్ పాలీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలుపెట్టాడు. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో వచ్చిన 'సర్వం మాయ' సినిమా మలయాళ ఇండస్ట్రీలో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ట్రేడ్ ట్రాకర్ 'సాక్నిల్క్' (Sacnilk) ప్రకారం ఈ సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

మొత్తంగా మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 106.8 కోట్లు వసూలు చేసింది. ఇక ఇండియా గ్రాస్ చూసుకుంటే రూ....