భారతదేశం, ఫిబ్రవరి 22 -- పత్తి కొనుగోళ్లపై సీసీఐ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రైతన్నల దగ్గర నిల్వ ఉన్న, లేట్‌ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తిని కొనుగోళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇప్పటికే సీసీఐ కేంద్రాలు మూతపడాల్సి ఉండగా.. రైతుల కోసం పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ఈ నెలాఖరు వరకు పత్తి సేకరణను కొనసాగించాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నిర్ణయించింది.

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం సీసీఐ ఇప్పటివరకు 8.8 లక్షలకు పైగా రైతుల నుండి రూ.12,823 కోట్ల విలువైన 16.15 లక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో పత్తి ఇంకా తీస్తున్నందున సేకరణ తేదీని పొడిగించాలని కోరుతూ కేంద్ర జౌళి మంత్రి, సీసీఐ, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌క...