Hyderabad, సెప్టెంబర్ 10 -- త్వరలో దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. చంద్రుడి సంచారం కూడా చాలా ముఖ్యమైనది. అయితే రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఇతర గ్రహాలతో సంయోగం చెందినప్పుడు శుభ ఫలితాలు ఏర్పడతాయి.

ఇప్పుడు త్వరలో మహాభాగ్య రాజయోగం ఏర్పడనుంది. అది కూడా నవరాత్రుల సమయంలో ఏర్పడనుంది. నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 13న కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. నవరాత్రులులో సెప్టెంబర్ 24న ఉదయం 2:55కి తులా రాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు.

సెప్టెంబర్ 26 వరకు అదే రాశిలో కొనసాగిస్త...