Hyderabad, ఏప్రిల్ 29 -- పొడవాటి, ఒత్తైన జుట్టు ప్రతి ఒక్కరి కల. కానీ నేటి జీవనశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి... వెరసి జుట్టు రాలడం సాధారణ సమస్యగా తయాయరింది. వీటితో పాటు మీరు ఊహించని ఒక చిన్న అలవాటు కూడా మీ జుట్టు రాలడానికి కారణం కావచ్చు తెలుసా? దీన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అదే మీరు నిద్రపోయే విధానం!

రాత్రంతా మీ జుట్టు ఎలా ఉంటుందో పట్టించుకోకపోతే, అది బలహీనంగా మారి రాలడం మొదలుపెడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి నిద్రపోయేటప్పుడు జుట్టును విప్పేసి పడుకోవాలా లేక చక్కగా జడ వేసుకుని పడుకోవాలా? ఎలా ఉంచితే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు? తెలుసుకుందాం!

నిద్రపోయేటప్పుడు జడ వేసుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో, కొన్ని రకాల కట్టుబాట్లు జుట్టుకు హాని కూడా కలిగిస్...