భారతదేశం, ఆగస్టు 20 -- హై యాక్షన్ థ్రిల్లర్ గా థియేటర్లకు వచ్చిన రజనీకాంత్ 'కూలీ' (Coolie) మూవీ కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఆరో రోజు వసూళ్లు ఇంకా డౌన్ అయ్యాయి. మంగళవారం (ఆగస్టు 19) కలెక్షన్లు పడిపోయాయి. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆరు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ సినిమాకు వీకెండ్ లో అదిరే వసూళ్లు తగ్గాయి. ఆగస్టు 14న ఈ మూవీ రిలీజైంది. కానీ ఇప్పుడు కలెక్షన్లు తగ్గుతున్నాయి. ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం కూలీ సినిమా మంగళవారం ఇండియాలో సుమారు రూ. 8.11 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 214.61 కోట్లకు చేరాయి.

కూలీ సినిమాకు రూ. 65 కోట్లతో భారీ ఓపెనింగ్ లభించింది. ఆ తర్వాత శుక్రవారం 15% వసూళ్లు తగ్గి రూ. 54.75 కోట్లు వచ్చాయి. వారాంతంలో సినిమాకు మరింత ...