భారతదేశం, మార్చి 31 -- సముద్ర దోసకాయల అక్రమ రవాణా చట్టవిరుద్ధం మాత్రమే కాదు.., సముద్ర పర్యావరణ వ్యవస్థకు కూడా ప్రమాదకరం. ఇటువంటి నేరాలను నివారించడానికి కోస్ట్ గార్డ్, వన్యప్రాణి శాఖ నిరంతరం కృషి చేస్తున్నాయి. అయితే ఈ అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా ఆపడానికి, మత్స్యకారులు ఈ వ్యాపారానికి దూరంగా ఉండేలా కఠినమైన చట్టాలు, అవగాహన అవసరం.

తమిళనాడులోని రామేశ్వరం తీరంలో జరిగిన ఒక ప్రధాన ఆపరేషన్‌లో భారత తీర రక్షక దళం సుమారు రూ.80 లక్షల విలువైన సముద్ర దోసకాయలను స్వాధీనం చేసుకుంది. సముద్ర దోసకాయలను ఒక పడవలో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు భారత తీర రక్షక దళానికి రహస్య సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు కోస్ట్ గార్డ్ రామేశ్వరం సమీపంలో అనుమానాస్పద పడవను అడ్డగించి, దానిని పరిశీలించినప్పుడు.. దానిలో పెద్ద మొత్తంలో సముద్ర దోసకాయలు కనిపించాయి. వాటి విలువ అంతర్జాతీయ మ...