భారతదేశం, నవంబర్ 2 -- పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూప కెమికల్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పాశమైలారం సమీపంలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడంతో చుట్టుపక్కల అంతా దట్టమైన పొగతో కమ్ముకుంది.

స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. ఈ రూప కెమికల్స్ పరిశ్రమ ఆరు నెలలుగా మూతపడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరగలేదు. కానీ పరిశ్రమకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా సమాచారం.

అయితే పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలు మంటలు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. అగ్నిమాపక సిబ్బంది చుట్టు...