భారతదేశం, జూలై 30 -- బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ తన ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ చూపుతారో అందరికీ తెలుసు. తరచుగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు పంచుకుంటూ అందరికీ స్ఫూర్తినిస్తుంటారు. తాజాగా జూలై 30న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గత నాలుగు వారాలుగా తాను ప్రతి ఉదయం ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బతో రోజును ప్రారంభిస్తున్నానని, దాని వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు పొందానని సోహా వెల్లడించారు. ఈ వీడియోలో ఆమె వెల్లుల్లి తింటూ కనిపించారు. "గత నాలుగు వారాలుగా, నేను నా ఉదయాన్ని ఒక చిన్న పచ్చి వెల్లుల్లి ముక్కతో మొదలుపెడుతున్నాను" అని ఆమె రాసుకొచ్చారు. ఒకే ఒక వెల్లుల్లి రెబ్బతో కలిగే ప్రయోజనాల జాబితాను కూడా ఆమె వివరించారు. అవేంటో చూద్దాం.

సోహా అలీ ఖాన్ చెప్పిన దాని ప్రకారం, ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తినడ...