Andhrapradesh, జూన్ 11 -- ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకు అనుగుణంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశారు.

మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు. జూలై మొదటివారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు.

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, ప్రత్తిసాగు చేస్తుండగా... వేరుశనగ, ప్రత్తి సాగు తగ్గుతూ వస్తోందని పేర్కొన్న...