Andhrapradesh,amaravati, ఆగస్టు 23 -- ఏపీలోని అన్నదాతలకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రానున్నాయి. ఎటువంటి తప్పులకు అస్కారం లేకుండా వీటిని రూపొందిస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ప్రింట్ చేయిస్తున్నారు. ప్రస్తుతానికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ సిద్దంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

ఎలాంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని మంత్రి అనగాని చెప్పారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల్లో 50 శాతం పుస్తకాల్లో తప్పుల తడకలే ఉన్నాయంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదన్నారు. రీ సర్వే జరిగిన 6688 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించగా. 2 లక్షల 79 వేల అర్జీలు వచ్చాయన్నారు. వాటన్నంటినీ వంద శాతం పరిష్కరించామని చెప్పారు. ఆ తర్వాత 17,600 గ్...