భారతదేశం, జనవరి 13 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు పండుగ సమయంలో షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వార్టర్ రూ.99 ఉన్న మద్యం సిసాలు మినహా అన్ని రకాల బ్రాండ్లపై పరిమాణంతో సంబంధం లేకుండా రూ.10 చొప్పున పెంచింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జీఓ ఎంఎస్ 22ను జారీ చేశారు. దీని ప్రకారం, మద్యంపై రూ.99 (180 ml) ఎంఆర్‌పీ కలిగిన క్వార్టర్ మినహాయించి.. అన్ని బాటిళ్ల మీద రూ.10 చొప్పున ఎక్కువగా వసూలు చేస్తారు.

అంతేకాకుండా బార్‌ లైసెన్స్‌దారులపై విధిస్తున్న 15 శాతం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ప్రభుత్వం తొలగించింది. ఇక మీద మద్యం దుకాణదారులు, బార్ లైసెన్స్‌దారులు ఏపీఎస్‌బీసీఎల్ నుంచి ఒకే ధరకు మద్యం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024-26 సంవత్సరానికి దుకాణాలకు సంబంధించి కొత్త ఎక్సైజ్ విధాన...