భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి పండగ వేళ ఏపీకి ఎన్టీఏ ఆధ్వర్వలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగానికి 15వ ఆర్థిక సంఘం సిఫార‌సు చేసిన మొత్తం రూ.2,600 కోట్ల గ్రాంటును పొంద‌టంలో రాష్ట్రం స‌ఫ‌లీకృత‌మైంది. ఇందులో భాగంగా ఐద‌వ మ‌రియు ఆఖ‌రి విడ‌త‌గా రూ.567.40 కోట్ల గ్రాంటును ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఈ నిధులను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ మ‌రియు ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల కోసం వినియోగిస్తారు. అంతేకాకుండా సామాజిక ఆరోగ్య కేంద్రాల‌కు అవ‌స‌రాల మేర‌కు భ‌వ‌నాల నిర్మాణం, డ‌యాగ్నోస్టిక్ సేవ‌ల‌ను మెరుగుప‌ర్చ‌డానికి, బ్లాక్ లెవ‌ల్ ప‌బ్లిక్ హెల్త్ లేబ‌రెట‌రీల ఏర్పాటుకు ...