భారతదేశం, నవంబర్ 7 -- ఇటీవల బాలీవుడ్ జంటలు వరుసగా తల్లిదండ్రులుగా మారుతున్నారు. ఇటీవల ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (నవంబర్ 7) అధికారికంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బాలీవుడ్‌లో అత్యంత క్రేజీయెస్ట్ కపుల్స్‌లో ఒకరిగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ జంట నిలిచింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఇది చాలా మంది అభిమానులకు సంతోషాన్ని పంచింది. అలాగే కత్రినా కైఫ్ బేబీ బంప్ ఫొటోలు కూడా పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకుంది. అయితే, కత్రినా కైఫ్ ప్రెగ...