భారతదేశం, అక్టోబర్ 28 -- మెుంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల సేకరణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి, పత్తి, మొక్కజొన్న సహా పంటల కొనుగోళ్ల సమయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నష్టం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేయాలన్నారు. పంట ఉత్పత్తులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. రైతులకు అన్ని విధాలుగా సహకరించాలని ఆదేశించారు.

మరోవైపు తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లా కలెక్టర్లతో సమన్వయం, అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉండటంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వరి సేకరణ ప్రక్రియకు మెుంథా తుపాను అంతరాయం కలిగించకుండా చూసుకోవడానికి అవసరమైన అన్ని చర్యల...