భారతదేశం, డిసెంబర్ 9 -- పంట అవశేషాలను కాల్చకుండా, వాటిని మట్టిలో కలపాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది. గత రెండు వారాలుగా ఖరీఫ్ వరి కోతలు కొనసాగుతున్నాయని, అయితే అనేక ప్రాంతాల్లో రైతులు కోత తర్వాత వరి గడ్డి, దుబ్బులకు నిప్పు పెడుతున్నారని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జీలానీ సమూన్ అన్నారు. ఇలా కాల్చడం ద్వారా నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తీవ్రమైన పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది.

'రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ఉండాలి. నేల సారాన్ని కాపాడటానికి అవశేషాలు భూమిలో కలపాలి.' అని ఒక అధికారిక పత్రికా ప్రకటనలో సమూన్ అన్నారు. రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతులతో కలిసి గడ్డి కాల్చడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బంది రైతులకు సలహా ఇవ్వడం, పర్యావరణపరంగా సురక్షితమైన పద్ధతుల...