Amaravati, జూలై 23 -- రాష్ట్రమంతటా ఏ సర్వే నెంబర్ భూమిలో ఏ పంటలు పండిస్తున్నారనే పంటల వివరాలు శాటిలైట్ సర్వే ద్వారా సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం భలభద్రాపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందన్నారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం, శాటిలైట్ సర్వే సమాచారం సరిపోల్చాలని స్పష్టం చేశారు.

రీసర్వే అనంతరం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగిన తర్వాత వ్యవసాయ రికార్డులు కూడా నవీకరించాలని అధికారులను ముఖమంత్రి ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని వారికి అందేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. మరోవైపు ఇప్పటి వరకూ 47,41,792 మంది రైతుల వివరాలత...