Telangana,hyderabad, జూలై 24 -- శ్రావణ మాసం వేళ టూరిస్టుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. 'అంబేడ్కర్ యాత్ర పంచ జ్యోతిర్లింగ దర్శనం' పేరుతో సికింద్రాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైల్ ద్వారా జర్నీ ఉంటుంది. ఆగస్టు 16న ప్రారంభమయ్యే ఈ యాత్ర. ఆగస్టు 24వ తేదీన ముగుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్‌ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్‌ జ్యోతిర్లింగం చూస్తారు. అంతేకాకుండా నాసిక్‌ లోని త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగం, పుణెలోని భీమశంకర్‌ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌ వద్ద ఘృష్ణేశ్వర్‌ జ్యోతిర్లింగంతో పాటు పలు ప్రాంతాలను చూసే వీలు ఉంటుంది.

ఈ ట్రిప్ 9 రోజులు, 8 రాత్రులు ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్...