భారతదేశం, జూన్ 25 -- జితేంద్ర కుమార్-నీనా గుప్తా కాంబినేషన్లో వచ్చిన పంచాయత్ సీజన్ 4 ఎట్టకేలకు ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందనతో దూసుకుపోతోంది. మంగళవారం (జూన్ 24) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ పొలిటికల్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ను చూసేశారా? ఇది మీకు నచ్చి, ఇంకేం చూడాలి అనుకునే ఫ్యాన్స్ కోసం ఈ లిస్ట్. పంచాయత్ సీజన్ 4లో ఎన్నికల కారణంగా ఉద్రిక్త వాతావరణం, మంచి పాతకాలాన్ని ఆస్వాదించాలని లేదా ప్రతి క్షణం తెచ్చిన సస్పెన్స్ ఇష్టపడినా.. ఇలా ప్రతి విషయంలో ఓ వెబ్ సిరీస్ ఉంది. ఓటీటీ ప్లే ప్రీమియంలో మీరు ఈ వెబ్ సిరీస్ లు చూడొచ్చు.

వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన రంగ్ బాజ్.. కుర్చీ పవర్ కు సంబంధించిన వెబ్ సిరీస్. పంచాయత్ తరహాలోనే అవినీతిపరులైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల అండదండలతో అధికారంలోకి వచ్చే ఓ వ్యక్తి...