Hyderabad, జూలై 7 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'పంచాయత్' నాలుగో సీజన్ జూన్ 24న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పటికే ఈ సీజన్ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేసింది. సోమవారం (జులై 7) అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ఈ షో సీజన్ 5 తో తిరిగి వస్తుందని ప్రకటించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న పంచాయత్ నాలుగో సీజన్ గత అన్ని సీజన్‌లను వ్యూయర్స్ సంఖ్యలో అధిగమించింది. స్ట్రీమింగ్ మొదలైన రోజునే.. 'పంచాయత్' సీజన్ 4 యుఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, యూఏఈ సహా 42కి పైగా దేశాలలో టాప్ 10 టైటిల్స్‌లో ట్రెండ్ అయ్యింది. విడుదలైన మొదటి వారంలో 180కి పైగా దేశాలలో స్ట్రీమ్ అయింది. ఇండియాలో మాత్రం నంబర్ 1గా ట్రెండింగ్ అవుతోంది.

ఇక ఇప్పుడు పంచాయత్ సీజన్ 5 ఇప్పటికే మొదలైందని, 2026లో ప్రీమియర్ అవుతుందని అమెజాన్ ప్రైమ...