Hyderabad, జూలై 15 -- 'పాతాళ్ లోక్', 'పంచాయత్' వెబ్ సిరీస్ లలో నటించిన ఆసిఫ్ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజుల క్రితం అతనికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు అతని పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉందని, మరికొద్ది రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పంచాయత్ వెబ్ సిరీస్ నటుడు ఆసిఫ్ ఖాన్ కు గుండె పోటు అనే వార్త వైరల్ అయింది. కేవలం 34 ఏళ్ల వయసులోనే అతనికిలా జరగడంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. మరోవైపు హాస్పిటల్ బెడ్ పై నుంచి ఆసిఫ్ తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

"గత 36 గంటలు దీనిని చూసిన తర్వాత, జీవితం చాలా చిన్నదని గ్రహించాను. కాబట్టి ఒక్క రోజును కూడా తేలికగా తీసుకోవద్దు. ఒక్క క్షణంలో అన్నీ మారిపోతాయి. మీ వద్ద ఉన్నదానికి, మీరు ఉన్న స్థితికి కృతజ్ఞతతో ఉండండి. మీకు ఎవరు ముఖ్యమో...