భారతదేశం, జనవరి 21 -- డిఫరెంట్ స్టోరీ లైన్ ఉన్న సినిమాలు చేస్తూ, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నవీన్ చంద్ర మరో థ్రిల్లర్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'హనీ'తో థియేటర్లకు రాబోతున్నాడు నవీన్ చంద్ర. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది.

సైకలాజికల్ థ్రిల్లర్ గా హనీ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ తో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజిక్ ఎలిమెంట్స్ తో ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. వెన్నులో వణుకు పుట్టించేలా వున్న టీజర్ సినిమాపై అమాంతం ఆసక్తిని పెంచింది.

హనీ మూవీ టీజర్ ఉత్కంఠ రేపేలా ఉంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్నారు. కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ ...