భారతదేశం, నవంబర్ 18 -- బాలకృష్ణ-నయనతార.. ఈ పెయిర్ ది హిట్ కాంబినేషన్. వీళ్లు ఇప్పటికే మూడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు నాలుగో సినిమా రెడీ కానుంది. బాలకృష్ణ, నయనతార హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని ఓ మూవీ తెరకెక్కించనున్నారు. ఎన్బీకే111 వర్కింగ్ టైటిల్ తో రెడీ కాబోతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అని మేకర్స్ ప్రకటించారు. ఆమె బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో మహారాణిగా నయనతార నటించనుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఇవాళ (నవంబర్ 18) నయనతార బర్త్ డే సందర్భంగా వీడియో రిలీజ్ చేశారు. మహారాణి గెటప్ లో వెనక్కి ధైర్యంగా చూస్తూ కనిపించింది నయనతార. గాడ్ ఆఫ్ మాసెస్, క్వీన్ మరోసారి కలిశారని వీడియోలో పేర్కొన్నారు.

''సముద్రాల ప్రశాంతతను, తుపానుల బ...