భారతదేశం, డిసెంబర్ 17 -- బైక్ లవర్స్‌కు బజాజ్ ఆటో తీపి కబురు అందించింది. ఐకానిక్ పల్సర్ 150 మోడల్‌ను భారీ మార్పులతో అప్‌డేట్ చేస్తూ 2026 ఎడిషన్‌ను సిద్ధం చేసింది. పల్సర్ 220F అప్‌డేట్ తర్వాత, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న 150 సీసీ సెగ్మెంట్ వంతు వచ్చింది. ఈ కొత్త మోడల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా డీలర్ల వద్దకు చేరుకోవడం చూస్తుంటే, మరికొద్ది రోజుల్లోనే అధికారిక లాంచ్ ఉంటుందని స్పష్టమవుతోంది.

సుమారు రెండు దశాబ్దాలుగా పల్సర్ గుర్తింపుగా ఉన్న 'వోల్ఫ్-ఐ' (Wolf-eye) హెడ్‌ల్యాంప్ డిజైన్‌కు బజాజ్ స్వస్తి పలికింది.

LED హెడ్‌ల్యాంప్: ఈసారి బైక్ ముందు భాగంలో మరింత షార్ప్‌గా ఉండే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ను అమర్చారు. ఇది బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

ఎల్‌ఈడీ ఇండికేటర్లు: ఇప్పటివరకు వచ్చిన హాలోజన్ బల్బుల స్థానంలో స్లిమ్ ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లను చేర్చా...