Delhi, ఏప్రిల్ 19 -- న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 19వ తేదీతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది. మే 10వ తేదీన సాయంత్రం అంకురార్పణం జ‌రుగ‌నుంది.

బ్రహ్మోత్సవాల ముందు మే 6వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వ‌హిస్తారు. మే 11వ తేదీ ఉదయం 6 నుండి 8.07 గంటల మ‌ధ్య వృషభ ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. సుప్ర‌భాతం, తోమ‌ల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మార...