భారతదేశం, డిసెంబర్ 30 -- రాజా సాబ్ అంటూ ఈ సంక్రాంతికి థియేటర్లకు వస్తున్నాడు ప్రభాస్. అయితే అంతకంటే ముందే డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ రోజున బిగ్ అప్ డేబ్ రెడీ చేస్తున్నారని సమాచారం. ఈ బజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న మూవీ స్పిరిట్. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ ఐపీఎస్ గా కనిపించబోతున్నాడు. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్. ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను 2026 న్యూ ఇయర్ రోజున రిలీజ్ చేసే అవకాశముంది. సందీప్ రెడ్డి వంగా ఈ మేరకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

జనవరి 1న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం సందీప్ రెడ్డి వంగాకు బాగా కలిసొచ్చేదే. ...