భారతదేశం, డిసెంబర్ 29 -- సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' (Varanasi) షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న అతడు.. సోమవారం (డిసెంబర్ 29) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి సందడి చేశాడు.

రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం బ్రేకులు అవసరమే. వరుస షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న మహేష్ బాబు.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కుటుంబంతో కలిసి ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. సోమవారం (డిసెంబర్ 29) ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఫ్యామిలీ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్లూ టీ-షర్ట్, బ్రౌన్ జాకెట్, జీన్స్ వేసుకుని.. తన ట్రేడ్‌మార్క్ క్యాప్, కళ్లజోడుతో మహేష్ బాబు సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. కూతురు సితార క...