భారతదేశం, డిసెంబర్ 27 -- కొత్త సంవత్సరం వేళ షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? బడ్జెట్ ధరలోనే ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ సిటీ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'సాయి సన్నిధి EX హైదరాబాద్' పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది.హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ట్రిప్ 7 జనవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ.7890గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6660,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6640...