భారతదేశం, డిసెంబర్ 31 -- నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రత దృష్ట్యా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించిన తర్వాత సురక్షితంగా ఇంటికి తిరిగి రాలేని వ్యక్తులకు ఉచిత రవాణా సేవలను ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, బాధ్యతాయుతమైన వేడుకలను ప్రోత్సహించడంతో పాటు నగరమంతటా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

డిసెంబర్ 31న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో ఉచిత రైడ్ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇదే విషయంపై టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు మరియు పాదచారులకు తీవ్రమైన ముప్పు ఉందన్నారు. ముఖ్యంగా పండుగ వేడుకల సమయం...