భారతదేశం, డిసెంబర్ 26 -- నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ కట్టడిపై హైదరాబాద్‌ నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 'జీరో డ్రగ్స్‌' విధానమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపట్టాలని సిటీ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అధికారులను ఆదేశించారు.

బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో శుక్రవారం ఆయన హెచ్‌-న్యూ, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, వెస్ట్‌జోన్‌, సీసీఎస్‌ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

''శుక్రవారం నుంచే నగరంలోని పబ్‌లు, హోటళ్లు రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించాం. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైనా...