భారతదేశం, జనవరి 1 -- నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా వాహనాలను పట్టుకున్నారు. మొత్తం 2,731 మందిపై కేసులు నమోదు చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి 5 శాతం కేసుల సంఖ్య తగ్గినట్లు పోలీసులు తెలిపారు. గత సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 2,873 కేసులు నమోదయ్యాయి.

ఈసార నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కమిషనరేట్ల వారీగా చూస్తే.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,198 మంది, సైబరాబాద్‌లో 928 మంది, మాల్కాజ్ గిరి కమిషరేట్‌ పరిధిలో 605 మంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. ఈ వివరాల ప్రకారం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లో నూతన సంవత్సర వేడుకలు పెద్ద సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా గడిచిపోయాయని సంబంధిత ...