భారతదేశం, డిసెంబర్ 31 -- కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో డెలివరీ ఏజెంట్లు, క్యాబ్ డ్రైవర్లు తమ నిరసన గళాన్ని విప్పారు. వేతనాలు, పనివేళలు, భద్రతపై స్పష్టమైన హామీలు కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లు నేడు (డిసెంబర్ 31) సమ్మె చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్‌తో పాటు క్యాబ్ డ్రైవర్లు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారు.

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. క్రిస్మస్ రోజున గురుగ్రామ్‌లో జరిగిన సమ్మె వల్ల సేవలు స్తంభించగా, ఇప్పుడు న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది.

డెలివరీ భాగస్వాములు తమ ప్రాణాలను పణంగా పెట్టి...