భారతదేశం, డిసెంబర్ 13 -- న్యూ ఇయర్ రాబోతుంది..! మరికొన్ని రోజులు అయితే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతాం. అయితే కొత్త సంవత్సరం వేళ చాలా మంది ఏవైనా టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లాలని చూస్తుంటారు..! అయితే మీకోసం ఐఆర్సీటీసీ. బడ్జెట్ ధరలోనే కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

అధ్యాత్మిక ప్రాంతాలను చూపించేందుకు IRCTC టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది. "కోస్టల్ కర్ణాటక' పేరుతో ఆపరేట్ చేయనుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ ఉంటుంది.

ప్రస్తుతం ఈ ప్యాకేజీ 6 జనవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను IRCTC టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctouris...