భారతదేశం, డిసెంబర్ 8 -- CRIF High Mark క్రెడిట్ బ్యూరో హోల్ టైమ్ డైరెక్టర్ రామ్‌కుమార్ గుణశేఖరన్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో క్రెడిట్ స్కోర్ గురించి పలు కీలక సూచనలు చేశారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..

ప్రశ్న: సంవత్సరం చివరలో ఉన్నాం. ఈ సమయంలో వ్యక్తులు తమ క్రెడిట్ ప్రొఫైల్, స్కోరుపై దృష్టి పెట్టడం ఎందుకు చాలా ముఖ్యం?

రామ్‌కుమార్: ఇది అత్యంత కీలక సమయం. ఏడాది ముగింపులో ప్రజలు తమ ఆర్థిక ఆరోగ్యాన్ని.. బడ్జెట్‌, పెట్టుబడులు, అప్పులను సమీక్షించుకుంటారు. అదే సమయంలో, పండుగలు, ప్రయాణాలు, అమ్మకాల కారణంగా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అందుకే, తరువాత లోపాలను సరిదిద్దుకునే కన్నా, నియంత్రణతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను సమీక్షించడం చాలా ముఖ్యం.

అంతేకాకుండా, చాలా మంది వినియోగదారులు జనవరిలో హోమ్ లో...